Director Shankar Land issue Case : సినీ దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు ప్రభుత్వ భూమి కేటాయింపులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. శంకర్‌కు భూమి కేటాయింపుల ప్రక్రియను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. శంకర్‌కు భూమి కేటాయింపును వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది. సినీ, స్టూడియో నిర్మాణం కోసం శంకర్‌కు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని మోకిల వద్ద 2019లో ప్రభుత్వం ఐదు ఎకరాలను కేటాయించింది. మార్కెట్ ధర కన్నా అతి తక్కువగా కేవలం రూ.5 లక్షలకు ఎకరం చొప్పున భూమి కేటాయించడం రాజ్యాంగ విరుద్దమంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి శంకర్ 2020లో పిల్ వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది.
Director Shankar Latest News : భూకేటాయింపులపై ప్రభుత్వానికి కచ్చితమైన విధానం ఉండాల్సిందని.. అయితే లేనంత మాత్రాన ఈ కేటాయింపును తప్పుపట్టలేమని తెలిపింది. భూమిని ఉచితంగా తీసుకోలేదని.. రూ.25 లక్షలు చెల్లించడంతో పాటు.. భూమి డెవలప్‌మెంట్ కోసం రూ.కోటి 25 లక్షలు ఖర్చు చేశానన్న శంకర్ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇలాంటి కేటాయింపుల్లో వేలం, టెండరు ప్రక్రియ అవసరం లేదని అభిప్రాయపడింది.
గతంలో ఈ కేసు విచారణ ఇలా జరిగింది..: సినీ దర్శకుడు ఎన్. శంకర్ భూకేటాయింపును సవాల్ చేస్తూ నమోదు అయిన పిల్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ విచారణలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే భూమి కేటాయించారని.. రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫిల్మ్ స్టూడియోలు, సినీ ప్రముఖులకు తక్కువ ఖర్చుతో భూములు కేటాయించడం కొత్తేమీ కాదని కోర్టుకు తెలిపింది. దరఖాస్తుదారుడి వాస్తవికత, హైదరాబాద్ సమీపంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు ప్రాముఖ్యత, రాష్ట్ర సినిమా రంగ అభివృద్ధిని పరిశీలించాకే.. భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకుందని కోర్టుకు చెప్పింది.
Telangana High Court : 'అదీ ఒక రకమైన భూ కబ్జానే'.. తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు
ప్రభుత్వ వాదన : ఆ ప్రదేశంలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి.. ఆధునిక స్టూడియో నిర్మించేందుకు రూ.50 కోట్లు పెట్టుబడిని తీసుకువస్తానని శంకర్ హామీ ఇచ్చినందునే.. రూ.5 కోట్లు డిపాజిట్ చేసిన తరవాత భూమిని కేటాయించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ స్టూడియోలో రోజూ 1000 మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తారని.. 100 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని డైరెక్టర్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి :