ETV Bharat / state

హామీల అమలు పర్యవేక్షణ విధానమేంటో చెప్పాలి: హైకోర్టు

High Court on Hetero Lands: హైదరాబాద్‌లో భూమిని కేటాయించడం వల్ల సాయి సిందు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే క్యాన్సర్ ఆస్పత్రిలో 25 శాతం బెడ్లు, 40 శాతం ఔట్ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం అందిస్తామన్న హామీల అమలుకు రూపొందించిన విధానాన్ని తెలియజేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఏడు నక్షత్రాల కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పినా.. పేదలు అందులోకి రావడానికి సాహసం చేయగలరా అని ప్రశ్నించింది. ట్రస్ట్ ఉచిత వైద్య సేవలపై ఇచ్చిన అమలును పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది.

High Court
High Court
author img

By

Published : Mar 25, 2023, 9:54 AM IST

High Court on Hetero Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ఖానామెట్ గ్రామంలోని రూ.కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని లీజు పేరుతో నామమాత్రపు ధరకు హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 50ను సవాల్ చేస్తూ రైట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ, డాక్టర్ ఊర్మిళ పింగ్లేలు దాఖలు చేసిన వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ బి.విజయ్​ సేన్​ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. భూ కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు. జడ్చర్లలో ఇదే హెటిరో గ్రూపునకు జరిగిన భూకేటాయింపులపై సీబీఐ కేసును ఎదుర్కొంటోందని తెలిపారు. తక్కువ ధరకు భూమిని కేటాయిస్తూ దానికి కారణాలు ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు. ఇదే ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రికి కేటాయింపులు జరిపినందున అదే ప్రాతిపదికన ఇప్పుడు కేటాయించడం సరికాదన్నారు.

Cancer Hospital in Serilingampally: బసవతారకం ఆసుపత్రికి 30 ఏళ్ల క్రిందట కేటాయింపు జరిగిందని.. అప్పటి ధరలకు ఇప్పుడు కేటాయింపు సరికాదన్నారు. ఏడాదికి రూ 1.47 లక్షల నామమాత్రపు ధరతో 33 ఏళ్లకు లీజుకు ఇచ్చిందని.. దీన్ని మరో 30 ఏళ్లకు పొడిగించవచ్చన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.750 కోట్లకుపైగా విలువజేన భూమిని కేవలం రూ.50 కోట్ల లీజుకే ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు.

ఈ క్రమంలో హెటిరో తరఫున వాదించిన సీనియర్​ న్యాయవాది.. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో 500 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి 1400 పడకలకు పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో 25 శాతం మందికి ఉచితంగా వైద్యం అందిస్తారని, 2 వేల మందికి వసతి కల్పించేలా ధర్మశాల కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంపన్నులు పన్నులు చెల్లిస్తారని, ఆ సొమ్ముతో ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తునాయని పేర్కొనగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పేదలు పరోక్షంగా పన్నులు చెల్లిస్తున్నారని పేర్కొంది.

ఆసుపత్రుల కొరతను దృష్టిలో ఉంచుకుని భూమిని కేటాయించారు: ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ వాదనలు వినిపిస్తూ మంత్రి మండలి నిర్ణయం మేరకు భూమి కేటాయింపు జరిగిందని.. ఇందుకు ప్రతిగా పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. క్యాన్సర్ ఆసుపత్రుల కొరతను దృష్టిలో ఉంచుకుని దానిని నెలకొల్పడానికి ఫౌండేషన్‌కు భూమిని కేటాయించినట్లు తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం.. ఫౌండేషన్ ఇచ్చిన హామీల అమలు పర్యవేక్షణ విధానమేమిటో చెప్పాలంటూ విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా చేసింది.

ఇవీ చదవండి:

రేపటి బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి.. కానీ ఒక కండిషన్​

TSPSC పేపర్​ లీకేజీ కేసు.. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

రాహుల్​పై అనర్హత వేటు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.