జైపాల్ రెడ్డి మృతి చెందాడంటే నమ్మకం కలగట్లేదని.. ఆయన ఫొటో చూస్తుంటే మన మధ్యే ఉన్నట్లు అనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. శంషాబాద్‌లోని కేఎల్ సీసీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. జైపాల్ రెడ్డి మృతి మైనారిటీ ప్రజలకు తీరని శోకమని తెలిపారు. మంచి మనసున్న నాయకుడు ఇక లేరనే వార్త రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే లోటన్నారు. జైపాల్ రెడ్డి సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
సంస్మరణ సభ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, కే.కేశవరావు, సుబ్బిరామి రెడ్డి, వివేక్ , గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాస్కీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రమేశ్ రాథోడ్, మాజీ ఎంపీ హర్ష కుమార్, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, మాజీ ఎమ్మల్సీ చింతల రాంచంద్రా రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి ; 'శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్'