గ్రేటర్ పరిధిలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా రెండు గంటలపాటు కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడా, టోలిచౌకి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
నగరమంతా జలమయం
ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, అల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌లో ఏకధాటిగా వర్షం కురిసింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణ నగర్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని స్థానికులు కాపాడారు.
కొట్టుకుపోయిన బండ్లు
కృష్ణానగర్‌లో భారీవర్షానికి వచ్చిన నీటిలో తోపుడు బండ్లు కొట్టుకుపోయాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల జగద్గిరిగుట్ట, సూరారం, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపుర్ శిల్పారామం సమిపంలో ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు వచ్చి చేరింది. మాదాపుర్ కోండాపుర్ మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు రంగంలోకి దిగి... నీరు నిలిచిన ప్రాంతాల్లో వాటిని పంపించారు.
కర్మాన్‌ఘాట్ ఉదయనగర్ కాలనీలో గతంలో ఎన్నడు లేని విధంగా వర్షం కురిసిందని రిటైర్డ్ ఇంజినీర్ అశోక్ తెలిపారు. ఇరిగేషన్ ఎక్సెస్ నీటిని డొమెస్టిక్ లైన్‌తో కలపడంతో తమ కాలనీకి గత రెండు సంవత్సరాలుగా ముంపు ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.
అత్యధికంగా... జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ 9.78 సెంటీమీటర్లు, అల్లాపూర్ వివేకానంద్ నగర్ 9.6, మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98, విరాట్ నగర్ 7.93, యూసఫ్‌గూడ 7.63, బాలానగర్‌లో 7.15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఫాతిమానగర్ 6.53, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ 5.98, హస్తినాపురం కమ్యూనిటీ హాల్ 5.95, కుత్బుల్లాపూర్, రంగారెడ్డినగర్ 5.93, జీడిమెట్ల 5.65, కేపీహెచ్‌బీ సీబీ సీఐడీ కాలనీ 5.68, ఆసీఫ్‌నగర్ 5.65, షాపూర్‌నగర్ 5.48, కూకట్‌పల్లి 5.45, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ 5.35, టోలీచౌక్ 5.25, వనస్థలిపురం 5.18 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.
- నగరంలో వర్షాపాతం వివరాలు ఇలా....
ప్రాంతం | వర్షపాతం వివరాలు |
జూబ్లిహిల్స్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ | 9.78 సెంటీమీటర్లు |
అల్లాపూర్ వివేకానంద్ నగర్ | 9.6 సెంటీమీటర్లు |
మాదాపూర్ | 8.75సెంటీమీటర్లు |
మోతీనగర్ | 7.98సెంటీమీటర్లు |
విరాట్ నగర్ | 7.93సెంటీమీటర్లు |
యూసఫ్‌గూడ | 7.63సెంటీమీటర్లు |
బాలానగర్ | 7.15సెంటీమీటర్లు |
ఫాతిమానగర్ | 6.53సెంటీమీటర్లు |
ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ | 5.98సెంటీమీటర్లు |
హస్తినాపురం కమ్యూనిటీ హాల్ | 5.95సెంటీమీటర్లు |
కుత్బుల్లాపూర్ | 5.93సెంటీమీటర్లు |
రంగారెడ్డినగర్ | 5.93సెంటీమీటర్లు |
జీడిమెట్ల | 5.65సెంటీమీటర్లు |
కేపీహెచ్‌బీ సీబీ సీఐడీ కాలనీ | 5.68సెంటీమీటర్లు |
ఆసీఫ్‌నగర్ | 5.65సెంటీమీటర్లు |
షాపూర్‌నగర్ | 5.48సెంటీమీటర్లు |
కూకట్‌పల్లి | 5.45సెంటీమీటర్లు |
బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ | 5.35సెంటీమీటర్లు |
వనస్థలిపురం | 5.18 సెంటీమీటర్లు |