ETV Bharat / state

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : 'ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం' - కాంగ్రెస్​ పార్టీపై హరీశ్​ రావు కామెంట్స్

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. దళితబంధు పథకాన్ని ఆపేందుకు కాంగ్రెస్​ కుట్ర పన్నుతోందని విమర్శించారు. కేసీఆర్​ భరోసా కార్డును ప్రతి ఇంటికి అందించాలని కార్యకర్తలకు సూచించారు.

Harish Rao Comments on Congress
Telangana Assembly Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 2:53 PM IST

Harish Rao Speech Ibrahimpatnam BRS Meeting ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. హ్యాట్రిక్​ బీఆర్​ఎస్​దే

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : ప్రతిపక్ష నాయకులు ఎన్ని ట్రిక్​లు చేసినా.. మళ్లీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్​ కొడతామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. ఇబ్రహీం పట్నంలో బీఆర్​ఎస్​ పార్టీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ భరోసా(KCR Bhorasa) కార్డును ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

Harish Rao on Ibrahimpatnam Development : దేశానికే ఆదర్శంగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని హరీశ్​రావు తెలిపారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని.. సాగునీరు ఒకటే రావాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అది కూడా వస్తుందని హామీ ఇచ్చారు. మహేశ్వరం- ఇబ్రహీంపట్నం మధ్యలో 500 పడకల ఆసుపత్రి రాబోతుందని తెలిపారు.

Minister Harish Rao Review On Viral Fevers : 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం'

రైతుబంధు నిధులు ఆపాలని ఈసీకి కాంగ్రెస్‌(CONGRESS) ఫిర్యాదు చేసిందని హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం నిధులు ఆరేళ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇస్తోందని గుర్తు చేశారు. మరో విడత 3 వేల కోట్లు మిగిలి ఉన్నాయని.. ఈసీ అనుమతి ఇస్తే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. లేని పక్షంలో అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధుని ఆపాలని కాంగ్రెస్​ కుట్ర పన్నుతోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని హరీశ్​రావు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

Minister Harish Rao Reacts on Raithu Bandhu : "కాంగ్రెస్​ వచ్చిందంటే.. పథకాలకు ఇక రాంరాం"

'వ్యవసాయాన్ని దండగ చేసిన పార్టీ కాంగ్రెస్​. కాంగ్రెస్ పార్టీ.. కరెంట్​ 3 గంటలు మాత్రమే ఇస్తానన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. బీఆర్​ఎస్(BRS)​ హ్యాట్రిక్​ కొడుతుంది. ప్రజలు కేసీఆర్​ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్​కు పోటీ వచ్చే సరైన నాయకుడు రాష్ట్రంలో లేడు. రాష్ట్రంలో అధికారం మారితే దీనస్థితిలోకి వెళ్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ ఆలోచించే విధంగా వారికి అవగాహన కల్పించాలి.' - హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి

Harish Rao Comments on Congress : కాంగ్రెస్​ నాయకులకు పదవుల మీద తప్ప ప్రజల మీద యావలేదని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్​కు పనితనం తప్ప పగతనం తెలియదని పేర్కొన్నారు. కేసీఆర్​ నిజంగా తన పగని చూపించి ఉంటే.. ప్రతిపక్ష నాయకులు అందరూ ఎప్పుడో జైలుకు వెళ్లేవారని అన్నారు. సోషల్​ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని.. కంటి ముందు జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని హరీశ్ రావు ప్రజలను కోరారు. మరోసారి కేసీఆర్​ను ఆశీర్వదించి.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Harish Rao Counter on Amit Shah Comments : 'కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ'

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.