ETV Bharat / state

'ప్రభుత్వ భూములను కాపాడాల్సినవారే ఆక్రమిస్తే ఎలా..?' - రంగారెడ్డి జిల్లా వార్తలు

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమనాయక్​ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో ఉప్రజ్ కుంట చెరువు భూముల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రెవెన్యూ అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు.

hanuma nayak allegations on mla jaipal reddy
'ప్రభుత్వ భూములను కాపాడాల్సినవారే ఆక్రమిస్తే ఎలా..?'
author img

By

Published : Mar 2, 2020, 5:21 PM IST

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్... అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు హనుమ నాయక్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామంలో ఉప్రజ్ కుంట చెరువు భూముల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని హనుమనాయక్​ తెలిపారు.

కలెక్టర్​తో పాటు పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. గ్రామాల్లో నీటి సమస్యను అరికట్టేందుకు చెరువులను సంరక్షిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్పందించి అన్యాక్రాంతం అయిన ఉప్రజ్ కుంటచెరువు భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

'ప్రభుత్వ భూములను కాపాడాల్సినవారే ఆక్రమిస్తే ఎలా..?'

ఇవీచూడండి: కారు కొంటానని వచ్చి... అమ్మకందారు వద్దే డబ్బు గుంజాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.