రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసీ తండాలో గవర్నర్ తమిళిసై(GOVERNOR TAMILISAI) రెండో డోసు టీకా(VACCINE) తీసుకున్నారు. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో టీకానే మనకు ఆయుధమని పేర్కొన్నారు. కేసీ తండాలో వందశాతం వ్యాక్సినేషన్(VACCINATION) జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITA INDRA REDDY)తో కలిసి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.
గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని తెలిసి ఇక్కడకు వచ్చాను. అందరూ టీకా తీసుకొని కొవిడ్(COVID) నుంచి రక్షణ పొందాలి. స్వదేశంలో అభివృద్ది చేసిన వ్యాక్సిన్ తీసుకోగలగడం మనందరికీ గర్వకారణం. మన సొంత వ్యాక్సిన్‌తో ప్రపంచానికి, విమర్శకులకు ఆదర్శంగా నిలిచాం. గిరిజనుల్లో, గ్రామాల్లో వ్యాక్సినేషన్ పెంచేందుకు అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలి. కొవిడ్ నియంత్రణలో, వాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రభుత్వ భాగస్వామ్యం అభినందనీయం. ఈ విపత్కర కాలంలో అందరూ విధిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి. -తమిళిసై, గవర్నర్
గవర్నర్ కేసీ తండాకు రావడం... టీకాపై గిరిజనుల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గిరిజన మహిళల్లో వ్యాక్సిన్‌పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఉద్దేశంతో గవర్నర్ ఇక్కడకు వచ్చారని తెలిపారు. గవర్నర్‌ను స్ఫూర్తిగా తీసుకొని వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Infections : కరోనా తర్వాత ఇన్ఫెక్షన్ల నుంచి అప్రమత్తత అవసరం