రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హశాంతివనంలో గూగుల్ ఇండియా బృందాలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణలో భాగంగా శాంతివనం ద్వారా గత నాలుగేళ్లుగా రకరకాల మొక్కలు నాటి తమ సహకారాన్ని అందిస్తున్నారు. రెండురోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గూగుల్ బృందం ఇవాళ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కలు నాటారు. రేపు కూడా ఇలానే కొనసాగుతుందని గూగుల్ ఇండియా బృందం టీం లీడర్ ఆచార్య రమాకాంత్ తెలిపారు.
ఇదీ చదవండిః శంకుస్థాపన వేళ కేటీఆర్, హరీశ్‌తో సెల్ఫీలు