శబరిమల కేసులో దేవుడికి ఉండే హక్కులపై విచారించాలని చిలుకూరు బాలాజీ శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఆ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌ను 'ఈటీవీ భారత్' సంప్రదించింది.
చర్చిలు, మసీదులకు లేని పన్నులు హిందూ దేవుళ్లకే ఎందుకుంటాయి. రాజ్యాంగంలో హిందూ దేవుళ్లకు ఉన్న హక్కులేంటి? కేవలం హిందూ దేవుళ్లకే 24.5 టాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు!? ఎందుకీ వివక్ష. శబరిమల అంశంపై తొమ్మిదిమంది జడ్జిల ధర్మాసనం ముందు చిలుకూరి బాలాజీని కూడా ఓ పిటిషనర్‌గా చేర్చాం. స్వామివారి తరఫున సాయి దీపక్ అనే న్యాయవాది వాదిస్తారు. - రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు