హైదరాబాద్ ఎల్బీ నగర్ అల్కాపూర్లోని హోటల్లో వికాస్ ఆగ్రో స్వారీ 22వ వార్షికోత్సవ సదస్సును నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. సూక్ష్మ పోషకాలు, బయో ఫెర్టిలైజర్స్ వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని విశ్వవిజేత ఆగ్రోస్ ఇండియా ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కనగాల సత్యనారాయణ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ డీపీ నాయుడు, ప్రజాకవి గోరేటి వెంకన్న హాజరయ్యారు. పంట భూములకు సూక్ష్మపోషకాలు ఎంత అవసరమో తెలుసుకుని దానికి అనుగుణంగా వికాస్ ఆగ్రోస్ పోషకాలను అందిస్తుందని పేర్కొన్నారు.
లక్షలాది మంది రైతుల విశ్వాసం, వేలాది మంది డిస్ట్రిబ్యూటర్ల సహకారంతోనే తాము ముందుకు వెళ్తున్నామని సత్యనారాయణ తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో వికాస్ ఆగ్రోస్ విభాగాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: మా దేవుడు నువ్వేనయ్యా... అక్కడి ప్రజలకు ఆ తహసీల్దార్ దైవమయ్యాడు!