రంగారెడ్డి జిల్లా జల్పల్లి పెద్దచెరువులో మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వం అందిస్తున్న ఎనిమిది వేల ఉచిత చేపపిల్లలను వదిలారు. హైదరాబాద్ మత్స్యశాఖ అధికారి సుకీర్తి, సహకార సంఘం ఛైర్మన్ కొప్పు పద్మతో కలిసి జల్పల్లి పురపాలక ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తోందని అధికారులు తెలిపారు. మత్స్యకారుల కుటుంబాల ఉపాధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి మత్స్యకారుల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్, మత్స్యకారుల సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.