తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. తాజా కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కి చేరుకుంది.
హయత్‌నగర్‌లో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో వైద్యఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. హయత్‌నగర్‌లోని సత్యనారాయణ కాలనీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యాధికారిణి నాగజ్యోతి తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి టీకా తీసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి: Andhra Pradesh Omicron Cases: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు