రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఔషధ నగరి కోసం తమ భూములు ఇవ్వబోమంటూ బాధిత రైతులు తేల్చిచెప్పారు. హైదర్‌గూడలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మేడిపల్లి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని బతిమిలాడుదామని వెళ్తే... పోలీసులు లాఠీఛార్జి చేశారని వాపోయారు. ఆ కోపంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఇది దృష్టిలో పెట్టుకుని మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాలకు చెందిన 10 మందిని పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం పండే పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే అస్తిత్వం కోల్పోయి... తమ ప్రాణాలు పోయినట్లేనని కుర్మిద్ద బాధిత రైతు పంగా అనసూజ వాపోయింది.
ఇవీ చూడండి: బెంగళూరు జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు