రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రషీద్ గూడ వద్ద గోడౌన్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. కాలపరిమితి దాటిన వందలాది కాటన్ల బీర్లను పారబోశారు.
లాక్డౌన్ కారణంగా అమ్మకాలు లేక కాలపరిమితి దాటిపోయిన 5,285 బీర్ కాటన్లను గుర్తించిన అధికారులు వాటిని నేలపాలు చేశారు. 1,26,840 బీరు సీసాలను ధ్వసం చేశారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని శంషాబాద్ ఆబ్కారీ సీఐ శ్రీనివాస్ తెలిపారు.