ETV Bharat / state

ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు: సబితా - తెలంగాణ వార్తలు

ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో దాదాపు రూ. 70 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు: సబితా

author img

By

Published : Jun 12, 2021, 4:16 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. దాదాపు రూ. 70 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 4వ డివిజన్​లోని కొత్తపేటలో పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం 3, 6, 7వ డివిజన్లలో వరదనీటి కాలువ పనులు, 8వ డివిజన్​లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందన్నారు. ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామనవి చెప్పారు. ప్రభుత్వ గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అంబులెన్సు వెంట శునకం పరుగులు- వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.