రంగారెడ్డి జిల్లా పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. నార్సింగి మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఛైర్మన్ పదవిపై మాత్రం హస్తం పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.
పురపాలిక పరిధిలోని 18 వార్డుల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. తెరాస ఏడు స్థానాల్లో, భాజపా ఒక వార్డులో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలుపొందారు.