రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని, కరోనా, లాక్డౌన్ నేపథ్యంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణదేనని ఎమ్మెల్యే తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉందని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
- ఇదీ చూడండి : బయటపడుతున్న లక్షణాలు... చిన్నారులకు ఎంఐఎస్ ముప్పు!