రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోహెడ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ ఛైర్మన్ కొత్త రాంరెడ్డి అన్నారు. ఈ రోజు కోహెడ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారు ప్రజల శ్రేయస్సుకోరి అహర్నిశలు కృషిచేస్తున్నారని వారిని గౌరవిస్తూ ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక