ETV Bharat / state

'మానవ అక్రమ రవాణాను చాలా వరకు అరికడుతున్నాం'

ప్రపంచ స్థాయిలో మానవ అక్రమ రవాణా తీవ్రంగా ఉందని శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఈ అక్రమ రవాణాను అరికడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.

dg jithender and cp mahesh bhagavath on human traffiking
మానవ అక్రమ రవాణాను చాలా వరకు అరికడుతున్నాం: జితేందర్​
author img

By

Published : Jul 30, 2020, 9:16 PM IST

ప్రపంచ స్థాయిలో మానవ అక్రమ రవాణా తీవ్రంగా ఉందని.. ఏటా 150 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనూ మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు.

మానవ అక్రమ రవాణాను చాలా వరకు అరికడుతున్నాం: జితేందర్​

సరైన సదుపాయాలు లేక చాలా చోట్ల వీటిని నిర్మూలించడంలో విఫలమవుతున్నారన్న ఆయన.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చాలా వరకు మానవ అక్రమ రవాణాను అరికడుతున్నట్లు వెల్లడించారు. అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే.. నేర రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు జితేందర్​ వివరించారు. ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రత్యేక బృందం ఏర్పాటు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బృందం అన్ని పోలీస్​ స్టేషన్​లను సమన్వయం చేస్తుందన్నారు.

అక్రమ రవాణాపై డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. కమిషనరేట్​ పరిధిలో ఇప్పటి వరకు 144 వ్యభిచార గృహాలపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 50 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు.

ఇదీచూడండి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.