వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బైఠాయించి, ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ. పది వేల సహయంతో అన్నదమ్ములకు, ఇంటి యజమానులకు, అద్దెకు ఉన్న వారికి గొడవలు సృష్టిస్తున్నారని నేతలు ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని, లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం