ETV Bharat / state

చిందులేసిన షాద్​నగర్​ సీఐపై సీపీ సజ్జనార్​ చర్యలు - CP SAJJANAR TAKE AN ACTION ON DANCED CI

ఓ ప్రైవేటు కార్యక్రమంలో తాగి చిందులేశారని పలు మీడియాల్లో వచ్చిన కథనాలకు స్పందించిన సీపీ... షాద్​నగర్​ సీఐపై చర్యలకు ఉపక్రమించారు. సైబరాబాద్​కు అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

CP SAJJANAR TAKE AN ACTION ON SHADNAGAR CI SRIDHAR KUMAR

author img

By

Published : Feb 24, 2020, 10:44 AM IST

రంగారెడ్డి జిల్లా షాదనగర్​లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో చిందులేసిన సీఐ శ్రీధర్ కుమార్​ను సైబరాబాద్​కు అటాచ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ విందు కార్యక్రమంలో సన్నిహితుల బలవంతంతో వారితో కలిసి నృత్యం చేయగా.... తాగి నృత్యాలు చేసారంటూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి.

ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లగా... వెంటనే చర్యలకు ఉపక్రమించారు. నిజానికి ఆ విందు కార్యక్రమంలో అసలు మద్యమే ఏర్పాటు చేయలేదని, వరసగా ఒత్తిళ్లతో పనిచేసినందున సరదా కోసం డ్యాన్స్ చేశామని పోలీసులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారం చేసిన మీడియాపై చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.