ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు నుంచి సూపర్ స్ప్రెడర్ల(super spreaders)కు వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం హుడా కమ్యూనిటీ హాల్లో ఈ రోజు సుమారు 1000 మందికి వ్యాక్సిన్(corona vaccination) వేయటానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రక్రియను డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం పది కౌంటర్ల వద్ద వాహకులకు టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేసిన అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచిన అనంతరం ఇంటికి పంపిస్తున్నారు.
ఇదీ చదవండి: Revenge: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..