ETV Bharat / state

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఆర్టీపీసీఆర్​కు రూ.750.. ర్యాపిడ్​కు రూ.3,900.. - telangana varthalu

Shamshabad Airport CEO: ఒమిక్రాన్​ భయాందోళన నేపథ్యంలో శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కరోనా టెస్టింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్​, ర్యాపిడ్​ టెస్టుల కోసం టర్మినల్​ వద్ద ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎయిర్​పోర్టు సీఈవో ప్రదీప్​ పనిక్కర్​ వెల్లడించారు. ఆర్టీపీసీఆర్​ టెస్టు కోసం రూ.750 చెల్లించి.. ఫలితం కోసం 6 గంటలు వేచి చూడాల్సి ఉంటుందని.. ర్యాపిడ్​ టెస్టు కోసం రూ.3,900 చెల్లించి రెండు గంటలు వేచి ఉండాలన్నారు.

Shamshabad Airport CEO: శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కరోనా టెస్టింగ్​ కేంద్రాలు ఏర్పాటు

author img

By

Published : Dec 8, 2021, 5:24 PM IST

Updated : Dec 8, 2021, 6:36 PM IST

Shamshabad Airport CEO: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎయిర్​పోర్టు సీఈవో ప్రదీప్​ పనిక్కర్​ వెల్లడించారు. అరైవల్​ గేట్ల వద్ద థర్మల్​ స్కానర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీపీసీఆర్​, ర్యాపిడ్​ టెస్టుల కోసం టర్మినల్​ వద్ద ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ప్రయాణికులకు ముందుగానే టెస్ట్​ చేయించుకునే అవకాశం కలిగిందన్నారు. ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులకు ప్రత్యేక హాల్​ను ఏర్పాటు చేశామన్నారు.

పాజిటివ్​గా తేలితే టిమ్స్​కే..

ఆర్టీపీసీఆర్​ టెస్టు కోసం రూ.750 చెల్లించి.. ఫలితం కోసం 6గంటలు వేచి చూడాల్సి ఉంటుందని శంషాబాద్​ ఎయిర్​పోర్టు సీఈవో ప్రదీప్​ పనిక్కర్​ చెప్పారు. ర్యాపిడ్​ టెస్టు కోసం రూ.3,900 ఖర్చుచేసి రెండు గంటలు వేచి ఉండాలన్నారు. 5ఏళ్ల చిన్నారులకు మినహాయింపు ఉంటుందన్నారు. చిన్నారులకు లక్షణాలు ఉంటే టెస్టు తప్పనిసరి అని స్పష్టం చేశారు. హై రిస్క్​ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆర్టీపీసీఆర్​ టెస్టు ఫలితాలు వచ్చిన తర్వాతే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. ఎయిర్​పోర్టులో పాజిటివ్​ అని తేలితే నేరుగా టిమ్స్​ ఆసుపత్రికి తరలిస్తామన్నారు.

ఇప్పటివరకు 13 మందికి పాజిటివ్

హైరిస్క్​ దేశాల నుంచి హైదరాబాద్​కు వారానికి 12 విమానాలు వస్తున్నాయని ఎయిర్​పోర్టు సీఈవో తెలిపారు. ప్రధానంగా లండన్ నుంచి 5 విమానాలు, సింగపూర్ నుంచి వారానికి మూడు విమానాలు వస్తున్నాయన్నారు. ఈ నెల 7న హై రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్​కు 1,908 మంది ప్రయాణికులు రాగా.. అందులో 13 మందికి పాజిటివ్​గా తేలింది. వారిలో జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఎవరికీ ఓమిక్రాన్ వేరియంట్ లేదని తేలినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

కరోనాపై 158 రోజుల పోరాటం- ఎట్టకేలకు మహిళ విజయం

Last Updated : Dec 8, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.