రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
దేశంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ చట్టం వల్ల అన్నదాతలకు నష్టమేనని నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి వాటిని రద్దు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నిరసన