మూడు నెలలుగా కరోనా కరవుతో అల్లాడిపోతున్నపేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని టీ పీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
అరెస్టులు..
చేవెళ్ల ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల సొసైటీ ఛైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, గుండాల రాములు, టీ పీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షుడు అల్లవాడ, మాజీ ఎంపీటీసీ యాలాల మహేశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాండు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంగలి రాజు, పి.ప్రశాంత్, మల్లారెడ్డి, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు.
శాంతియుత ఉద్యమం..
అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా శాంతియుత ఉద్యమం చేస్తే అరెస్టులు చేయడం సరికాదని చేవెళ్ల ఎంపీటీసీ వసంతం అన్నారు. 200 నుంచి 500 వరకు వచ్చే కరెంటు బిల్లులు వేలాది రూపాయలు రావడమేంటని ప్రశ్నించారు. కరోనా కరవుతో అల్లాడి పోతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి : 'అధిక విద్యుత్ చార్జీలు తెరాస వైఫల్యమే'