కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ హయత్ నగర్ వద్ద తలపెట్టిన భారత్ బంద్‌ను (bharat band) పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్లు రవిని అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. శాంతియుత ఆందోళనను తెరాస ప్రభుత్వం అడ్డుకోవడంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నరేంద్రమోదీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర ధరలు, ముడిసరుకుల ధరలు తగ్గించాలని కోరారు.
అరెస్ట్‌లు చేసి అడ్డుకంటే దాని ప్రతిఘటన అంతకంటే ఎక్కువే ఉంటుందని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి ఇష్టారాజ్యంగా పాలన చేస్తే సహించేది లేదని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అరెస్ట్‌లతో ఉద్యమాన్ని కేసీఆర్ ఆపలేరని హెచ్చరించారు.
ఎందుకీ బంద్ అంటే...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు... హైదరాబాద్‌లో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో పాటు రైతు సంఘాలు బంద్‌కు (bharat band) మద్దతు తెలిపాయి.
ఇదీ చదవండి: Revanth Reddy Fires on modi and kcr: 'మోదీ మాయలో కేసీఆర్.. అందుకే రైతు ఉద్యమంలో యూ టర్న్'