రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాద్‌పల్లి గ్రామపంచాయతికి అనుబంధ గ్రామమైన వెంకటేశ్వర తండాకు చెందిన ఓ దంపతులకు రెండవ సంతానంలో కూడా ఆడశిశువు జన్మించింది. ఆ పసికందును సాకలేమంటూ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
భారమైతే మాకు అప్పగించండి
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. 2016 నుంచి ఇప్పటివరకు రెండవ, మూడవ సంతానంలో పుట్టిన పదకొండు మంది ఆడపిల్లలను పోషించలేమని తల్లిదండ్రులు శిశువిహార్‌కు అప్పగించారని తెలిపారు. యాచారం, మంచాల మండలాల్లో గిరిజన తండాలు, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో, మగ పిల్లల కోసం ఎదురుచూస్తూ... ఆడపిల్లలు పుట్టడంతో ఎవరికి తెలవకుండా చంపడం, లేదా విక్రయించడం జరుగుతుందని వివరించారు. కొంచెం అవగాహన ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లల్ని తాము పెంచలేమనే సాకుతో శిశువిహార్‌కు అప్పగిస్తున్నారని వెల్లడించారు. ఆడపిల్లలు భారమైతే చంపవద్దని, విక్రయించవద్దని శిశువిహార్‌కు అప్పగించాలని ఐసీడీఎస్ అధికారిణి శాంతిశ్రీ కోరారు.
ఇదీ చూడండి: ఈ అంజన్నకు మాంసాహారమే నైవేద్యం