ETV Bharat / state

పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : సుధీర్​ రెడ్డి - బస్తీల్లో పల్లెనిద్ర

బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని పతుళ్లగూడలో బస్తీనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

basthi sleep by lb nagar mla sudheer reddy is in nagole division in pathullaguda
పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : సుధీర్​ రెడ్డి
author img

By

Published : Jan 31, 2021, 4:18 AM IST

బస్తీనిద్ర కార్యక్రమం మొదలై పదకొండేళ్లయినా సందర్భంగా ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని పతుళ్లగూడలో బస్తీనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

basthi sleep by lb nagar mla sudheer reddy is in nagole division in pathullaguda
బస్తీనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి

ఉదయం నుంచి పతుళ్లగూడలో పర్యటించి అదే కాలనీలో బస్తీ నిద్ర చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్, బీఆర్​ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో దాదాపు డెబ్భైశాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస సీనియర్ నాయకులు, బస్తీ వాసులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కారం తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.