కార్పొరేట్ క్షౌరశాలల ఏర్పాటుతో తమ కులవృత్తి నశించిపోతోందని నాయి బ్రాహ్మణులు రోడ్డెక్కారు. వాటిని మూసివేయాలంటూ హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విస్తరించడం వల్ల తమ ఉపాధిని కోల్పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమ కుల వృత్తికి చట్టబద్ధత కలిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని నాయీబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు అంజయ్య కోరారు. కార్పొరేట్ క్షౌరశాలల కన్నా అందుబాటులో ఉన్న దేశీయ సెలూన్లను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లాలో నాయి బ్రాహ్మణులు 22 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇతర కులాల మాదిరే తమ వర్గాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.