ETV Bharat / state

'మా ప్రాంతంలో కరోనా సమస్య నివారణ కోసం సీఎంను కలుస్తాం' - అత్తాపూర్ డివిజన్ తాజా కరోనా వార్తలు

కరోనా మహమ్మారి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య కోరుతున్నారు. ప్రజలు ఆంక్షలు పాటించకుండా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్​ను కలుస్తామని చెబుతున్నారు.

attapur corporator vijaya we will meet the CM for the corona problem
మా ప్రాంతంలో కరోనా సమస్య కోసం సీఎంను కలుస్తాం
author img

By

Published : Jul 11, 2020, 10:07 PM IST

కొవిడ్​ కేసులు తమ ప్రాంతంలో పెరుగుతున్నా ప్రజలు ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్​లో ఇప్పటికే 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 12 మంది మరణించారని చెప్పారు. మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్​కి ఈ విషయం తెలిపామన్నారు. సీఎం కేసీఆర్​, కేటీఆర్​ను కూడా త్వరలో కలుస్తామని చెప్పారు. ఎవరూ బయటికి వెళ్లకుండా నియమం పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని ఆమె సూచించారు.

అత్తాపూర్ డివిజన్ ఆనుకుని ఉన్న జియాగూడ డివిజన్ నుంచి ఇక్కడికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అందువల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రతిరోజు మున్సిపల్ అధికారులు బ్లీచింగ్, శానిటైజ్​ పక్రియ చేసినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందని తెలిపారు.

ఇదీ చూడండి : ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.