ETV Bharat / state

డిమాండ్ల సాధన కోసం అంగన్​వాడీల పోరుబాట

సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్​వాడీ కార్యకర్తలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఘర్షణకు దారి తీసింది. పోలీసులకు అంగన్​వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

అంగన్​వాడీల నిరసన
author img

By

Published : Jul 10, 2019, 4:27 PM IST

Updated : Jul 10, 2019, 5:13 PM IST

రంగారెడ్డి జిల్లా లక్డీకాపుల్​లోని కలెక్టరేట్ ముట్టడికి పెద్దఎత్తున అంగన్​వాడీలు వచ్చారు. కలెక్టరేట్​లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అంగన్​వాడీలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించడం వల్ల వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టర్​కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారంటూ అంగన్​వాడీలు ఆరోపించారు.

కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన అంగన్​వాడీలు అరెస్ట్​

ఇదీ చూడండి: వైరల్​: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా

Intro:HYD_TG_53_06_MEDCHAL_INDIANOIL_SWATCHABIYAN_AB_TS10046

Body:మేడ్చల్: ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ తోటి వారికి కూడా అవగాహన కల్పించాలని ఇండియన్ ఆయిల్ సౌత్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ మానస్ శోత్రే పేర్కొన్నారు. స్వచ్ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. పరిశుభ్రత నిరంతరం చేయవలసిన కార్యక్రమం అని ప్రతి ఒక్కరు పాటించి ఇతరులకు సూచించాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్త చెదరాన్ని చీపురులతో శుభ్రం చేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరప్రసాద్, అజయ్ శ్రీవాస్తవ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Conclusion:బైట్: రామారావు, ప్రధానోపాధ్యాయులు. బైట్: ఆంజనేయ వరప్రసాద్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. బైట్: మానస్ శోత్రే, సౌత్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్.
Last Updated : Jul 10, 2019, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.