ETV Bharat / state

ఆలోచనలు విత్తుదాం రండి..! - professor jayashankar varcity hyderabad

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ వర్సిటీలో అగ్రిహబ్‌ ఏర్పాటు చేసింది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల అమలుకు ఇది వేదికగా మారనుంది. అగ్రిహబ్‌తో ఒప్పందం చేసుకున్న అంకురాలకు ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు రూ.9 కోట్ల రుణాన్ని తాజాగా జయశంకర్‌ వర్సిటీకి మంజూరు చేసింది

agrihab-is-a-platform-for-innovation-with-international-standards-it-was-established-by-acharya-jayashankar-agricultural-university
ఆలోచనలు విత్తుదాం రండి
author img

By

Published : Mar 7, 2021, 9:29 AM IST

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్నఆవిష్కరణల వేదిక అగ్రిహబ్‌. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనిని ఏర్పాటుచేసింది. పంటసాగు, కలుపు తీయడం, కోత, విక్రయం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా పంటకు విలువ పెంపు, పశువులు, పండ్లు, కూరగాయలు.....ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అధునాతన పరిజ్ఞానంతో సమస్యలకు సులభ పరిష్కార మార్గాలు చూపడమే ఈ అగ్రిహబ్‌ ప్రధాన లక్ష్యం. దేశంలో ఏ వ్యవసాయ వర్సిటీలో లేని అత్యంత అధునాతన ఆవిష్కరణల అంకురాలతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తూ ఒకసారి ప్రకటన ఇవ్వగా 90 కంపెనీలు వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చాయి. వీటిలో రైతులకు సులభంగా ఉపయోగపడేలా ఉన్న 12 సంస్థలను వర్సిటీ ఎంపిక చేసింది. రైతుల పొలాల్లోనే ఈ ప్రయోగాలను చేసి చూపాలని వాటిని కోరింది. మరోసారి ప్రకటన ఇచ్చి మరిన్ని అంకుర సంస్థలను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తోంది. అగ్రిహబ్‌తో ఒప్పందం చేసుకున్న అంకురాలకు ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు రూ.9 కోట్ల రుణాన్ని తాజాగా జయశంకర్‌ వర్సిటీకి మంజూరుచేసింది.

యువతకు ఇదొక అద్భుత అవకాశం

-డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, ఉపకులపతి, జయశంకర్‌ వర్సిటీ

యువత కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి అగ్రిహబ్‌ అవకాశాలు కల్పించి వారిని వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా రూపుదిద్దుతుంది. వ్యవసాయ డిప్లొమా, డిగ్రీలు చేసినవారు సైతం వాణిజ్యవేత్తలుగా ఎదగడానికి అవకాశాలను కల్పిస్తాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యవసాయరంగానికి దిక్సూచిలా మారేలా వ్యవసాయ వర్శిటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఐటీ నిపుణులు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వారికి వ్యవసాయంలో వాటిని ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు. అలాంటివారిని అగ్రిహబ్‌లోకి తీసుకుని వ్యవసాయానికి వారి ఆవిష్కరణలు ఉపయోగపడేలా చేసే అనుసంధానకర్తల వర్సిటీ పనిచేస్తుంది.

ఇదీ చదవండి: ఎన్నికల షెడ్యూల్ తర్వాత తొలిసారి బంగాల్​కు మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.