హైదరాబాద్ నగరంలోని కొత్తపేట-సరూర్‌నగర్ రహదారిపై తాచుపాము కలకలం సృష్టించింది. ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్టు కొమ్మలపై నుంచి విద్యుత్ తీగలపై వెళ్తుండగా స్థానికులు, వాహనదారులు గమనించారు. విద్యుత్ తీగలపై వెళ్తున్న పామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
తాచుపాము కలకలంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఫ్రెండ్స్ స్నేక్ ఆఫ్ సొసైటీకి స్థానికులు సమాచారం అందించారు. సొసైటీ సభ్యులు అక్కడకు చేరుకుని పామును సురక్షితంగా బంధించి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: మద్యం బాటిళ్లకు పూజ చేసిన మందు బాబు