భార్యను ఎలాగైనా అంతమొందించాలని పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేసి చివరికి పోలీసులకు చిక్కాడు ఓ వ్యక్తి. మేడిపల్లి పోలీస్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సరస్వతి కాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి పూల కండ్ల శ్రీనివాస్‌రెడ్డి, సంగీత రెడ్డి భార్య భర్తలు. కొన్నాళ్ల కిందట వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. సంగీత రెడ్డి తన అత్త, మామ, భర్తపై కేసు పెట్టింది. కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ క్రమంలో నెల 26న ఉదయం 7 గంటల సమయంలో సంగీత రెడ్డి ఇంటి నుంచి వెళ్తుండగా భర్త శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారం తన తండ్రికి చెందిన ఇన్నోవా కారు ముందు, వెనుక నంబర్ ప్లేట్స్ తీసేసి వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన సంగీతరెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: భార్యపిల్లలను వేధించాడు... ఉరేసుకున్నాడు