రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి శివారులో మరోసారి చిరుత పులి దాడి కలకలం రేపింది. గురువారం తెల్లవారు జూమున రైతులైన సక్రియ, పాండు, బిక్కు నాయక్‌లకు చెందిన మూడు లేగదూడలను చంపేసింది. మూడు నెలలుగా చిరుత దాడులు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు దానిని బంధించడంలో విఫలమవుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అటవీ అధికారుల అసమర్థత కారణంగానే తమ దూడలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : మేము ఫెయిల్ అవుతూనే.. ఉండాలా?