దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1,581 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో నుంచి ఓ ప్రయాణికుడు సూట్ కేసుతో దిగాడు. ఆ సూట్ కేసును విమానాశ్రయంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. అనుమానం వచ్చి ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా జైపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సూట్ కేసులో 931 గ్రాముల బంగారంతో తయారు చేసిన సుత్తిని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ముంబయిలోనూ ఇదే తరహాలో
ముంబయి విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో ఓ ప్రయాణికుడు దుబాయి నుంచి దిగాడు. అతని సూట్ కేసు ముంబయి విమానాశ్రయంలోనే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. ఆ సూట్ కేసులోనూ 931 గ్రాముల బంగారం ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దుబాయి నుంచి వచ్చిన విమానంలోనే హైదరాబాద్‌కు చేరుకున్న మరో ఇద్దరు ప్రయాణికుల వద్ద కూడా 650 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురి అరెస్ట్
నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తీసుకొచ్చిన ఆరుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌తో పాటు ముంబయి విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 2,512 గ్రాముల బంగారం విలువ కోటి పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: శెనక్కాయల్లో విదేశీ కరెన్సీ తరలింపునకు యత్నం