ETV Bharat / state

YS Sharmila:'సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతా' - ఉమ్మడి కరీంనగర్​లో షర్మిల పర్యటన

కొవిడ్ మృతుల కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్​ షర్మిల డిమాండ్‌ చేశారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్లకు చేరుకున్న షర్మిలకు.. వైఎస్సార్‌ అభిమానులు స్వాగతం పలికారు. కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.

sharmila
sharmila
author img

By

Published : Jun 25, 2021, 3:49 PM IST

Updated : Jun 25, 2021, 5:03 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్‌ షర్మిల(YS Sharmila) పర్యటన సాగుతోంది. ఉదయం 7గంటలకు లోటస్‌ పాండ్‌ నుంచి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షర్మిల పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం సిరిసిల్లకు చేరుకున్న షర్మిలకు.. వైఎస్సార్‌ అభిమానులు స్వాగతం పలికారు. రాజన్నసిరిసిల్ల, కరీనంగర్ జిల్లాల్లో పర్యటించిన షర్మిల కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌, పదిర గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాధితులతో ఆమె మాట్లాడారు. కొవిడ్​ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

కరోనా కారణంగా ఎంతో మంది ఆప్తులను..ఆస్తులను కోల్పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కార్పోరేట్‌ వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే కరోనాను రాష్ట్ర ప్రభుత్వం అందులో చేర్చకుండా వందలాది మంది ఉసురు తీసిందని విమర్శించారు. ముఖ్యమంత్రికి కరోనా వస్తే యశోదా ఆస్పత్రికి వెళ్తారు. కానీ పేదలు మాత్రం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ఉంటే బెడ్ ఉండదు..బెడ్‌ ఉంటే డాక్టర్ అందుబాటులో ఉండరు కాబట్టే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు.

థర్డ్​వేవ్​ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించాల్సి ఉండగా వ్యాక్సిన్ల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాజన్నరాజ్యం వస్తుందని అందరిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కరీంనగర్‌‌లో సింగరేణి కార్మికులను కలుసుకొని వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు.

రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ఆమె అన్నారు. సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్‌ షర్మిల (YS Sharmila) తెలిపారు. త్వరలో తెలంగాణకు మంచి రోజులొస్తున్నాయని భరోసా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

పేదలందరికీ మెరుదైన వైద్యం అందించాలని వైఎస్​ హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతోందా...? కొవిడ్​ సమయంలో ఎంతో మంది కుటుంబసభ్యులను కోల్పోయారు. వైద్య ఖర్చుల కోసం ఇళ్లను కూడా అమ్మేసుకున్నారు. ఎంతో మంది మహిళలు భర్తలను కోల్పోయి పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో బాగవుతారన్న నమ్మకం ప్రజలకు లేదు. వైద్య ఖర్చుల కోసం ఆస్తులన్నీ తెగనమ్ముకున్నా ప్రాణాలు దక్కని పరిస్థితి. పోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పిద్దామంటే బెడ్లు ఉంటే ఆక్సిజన్​ ఉండడం లేదు... ఆక్సిజన్​ ఉంటే బెడ్లు ఉండవు. ఇదీ సర్కారు దవాఖానాల పరిస్థితి. - వైఎస్​ షర్మిల

ఇదీ చూడండి: YS Sharmila: షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం

Last Updated : Jun 25, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.