మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పట్టాలు ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చెల్లెళ్లకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయన విమర్శించారు. మిడ్ మానేరు ముంపునకు గురైన నీలోజిపల్లి, కొదురుపాక భూ నిర్వాసితులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధ్య మానేరు నిర్వాసితులతో కలిసి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : గో‘దారి’కి భారీ సొరంగం!