ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల కౌంటర్లో వెలుగులోకి వచ్చిన లడ్డూ టికెట్ల అవకతవకలపై మంగళవారం విచారణ చేపట్టారు. వరంగల్ జైల్లో ప్రింటవుతున్న టికెట్లలో సీరియల్ నంబర్ మిస్ కావటంతోనే సమస్య తలెత్తింది. వరంగల్ కారాగారంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ టికెట్ల వ్యవహారాన్ని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌కు వివరించారు. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, సాంకేతిక సమస్యతోనే జరిగిందన్నారు.
మరోసారి వునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెడతామని పేర్కొన్నారు. ప్రింటింగ్ విభాగంలో ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రామాచారికి జైల్ సూపరింటెండెంట్ మురళిబాబు మెమో జారీ చేసి, ఆ విభాగం నుంచి తప్పించినట్లు రమేశ్ తెలిపారు. మరోసారి ఈ సమస్య వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రస్తుతానికి 4 బుక్కుల్లో తేడాలు వచ్చినట్లు గమనించామన్నారు.
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం