వేములవాడ రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలని..ఆ తర్వాత అభిృద్ధి అజెండాతో ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మోదీతో పాటు కొనసాగిన మంత్రుల హవా