ETV Bharat / state

'హత్యకు గురైన రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి' - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్త

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో భూ తగాదాల నేపథ్యంలో మేనమామను అల్లుడు గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన విషయం విధితమే. దానిని నిరసిస్తూ మరణించిన రాజయ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ ఆందోళన విరమించేది లేదని గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు.

Villagers protest to demand justice for the rajaiah family who were killed in Mustabad in Rajna Sirisilla district
'హత్యకు గురైన రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి'
author img

By

Published : Sep 2, 2020, 1:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భూవివాదంలో మేనమామను అల్లుడు గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన పండగ రాజయ్య(50) అనే రైతును అతని మేనల్లుడు మల్లేశం వ్యవసాయ పొలములోనే భూ తగాదాలతో అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన విషయం విధితమే. దానిని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

రాజయ్య పేరిట ఉన్న ఆరు ఎకరాల భూమిని అధికారులు అన్యాయంగా నిందితుడు మల్లేశం పేరిట మార్చినందుకు భూతగాదాలు చోటుచేసుకున్నాయని, అక్రమంగా మల్లేశం పేరిట రిజిస్టర్​ చేసిన భూమిని రాజయ్య కుటుంబసభ్యులకు ఇవ్వాలని కోరారు. నిందితుడు మల్లేశాన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.