రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదంటూ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, కార్యదర్శి వజీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, కార్యదర్శలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి రవీందర్‌ను ఆదేశించారు.
ఇవీ చూడండి:ఈఎస్ఐ ఔషధ కొనుగోళ్లలో రూ.10 కోట్ల గోల్మాల్