రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆర్టీసీ బస్సు డిపో ముందు కార్మికులు ధర్నాకి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండే చేశారు. ప్రయాణ ప్రాంగణం వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులను అరెస్టు చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, నిలిచిపోయిన వేతనాలను చెల్లించాలని కార్మికసంఘం నాయకుడు లకావత్ రామిరెడ్డి కోరారు. కార్మికుల అరెస్ట్ తర్వాత ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లతో పోలీస్ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులను నడిపించారు.
ఇవీ చూడండి: 'సాయంత్రం 6 వరకు విధుల్లో చేరకుంటే ఉద్యోగులు కారు'