ETV Bharat / state

కరోనా మృతదేహాల అంత్యక్రియలకు తప్పని అడ్డంకులు - siricilla news

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. పట్టణంలో అంత్యక్రియలు జరపవద్దని సుమారు మూడు గంటల పాటు అంబులెన్సులు అడ్డుకున్నారు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారమైంది.

trouble for corona  died people cremations in vemulawada
కరోనా మృతదేహాల అంత్యక్రియలకు తప్పని అడ్డంకులు
author img

By

Published : Jul 28, 2020, 8:23 PM IST

కరోనా మృతదేహాల అంత్యక్రియలకు అడ్డంకులు తప్పటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా... పట్టణంలో అంత్యక్రియలు చేయకూడదంటూ స్థానికులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి(62)కి ఆదివారం రోజు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. సోమవారానికి ఆరోగ్యం క్షీణించటం వల్ల హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే బాధితుడు మృతి చెందాడు. మృతదేహాన్ని ఈరోజు పట్టణానికి తరలించారు.

పట్టణ డంపింగ్ యార్డు వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్సులో తరలించారు. డంపు యార్డు సమీపంలో గ్రామస్థులు అంబులెన్సును అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు అంబులెన్సులోనే మృతదేహాన్ని ఉంచారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి కొవిడ్ నిబంధనలతో మూలవాగులో అంత్యక్రియలు చేపట్టారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.