రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో పడిన పిడుగు గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. నివాసస్థలాలకు దగ్గర్లో ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడటం వల్ల ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
నివాసాలకు సమీపంలో మంటలు చెలరేగగా... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని కుండపోతగా వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఎత్తైన ప్రదేశాల్లో పిడుగులు పడ్డాయి. గ్రామంలో రోజువారీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.