ETV Bharat / state

ఆలయాల్లో టెండర్లు రద్దు కోరుతూ గుత్తేదారుల ధర్నా - telangana latest news

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో గత మార్చిలో టెండర్ హక్కు పొందినవారు... ఆ శాఖకు చెల్లించిన మొత్తాన్ని టెండర్​దారులకు వెంటనే చెల్లించాలని వ్యాపార సంఘం నేతలు డిమాండ్​ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈవో కార్యాలయం ముందు గుత్తేదారులు ధర్నా చేశారు.

ఆలయాల్లో టెండర్లు రద్దు కోరుతూ గుత్తేదారుల ధర్నా

author img

By

Published : Jul 29, 2020, 4:32 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఈవో కార్యాలయం ముందు గుత్తే దారులు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో గత మార్చిలో జరిగిన టెండర్ హక్కు పొందినవారు... చెల్లించిన మొత్తాన్ని వెంటనే తిరిగి ఇవ్వాలని వ్యాపార సంఘం నేతలు డిమాండ్​ చేశారు.

ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టెండర్ కాలం ప్రారంభమవుతుందని, అయితే కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దేవాలయాలు మూత పడ్డాయని... దీనివలన తమ వ్యాపారాలు మొత్తం నిలిచిపోయాయని వాపోయారు. అంతేకాకుండా మార్చిలో జరిగిన కొన్ని టెండర్లకు కోట్లాది రూపాయలు ఐదు నెలల క్రితం చెల్లించినా కూడా వ్యాపారాలు ప్రారంభం కాలేదని.... దానివల్ల తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆలయ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు వెంకటేశం, టెండర్ దారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.