ఉపాధి హామీ అమలులో రాష్ట్రానికి 9 పురస్కారాలు మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణకు జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో 9 అవార్డులు దక్కాయి. దిల్లీలోని పూసా విశ్వవిద్యాలయంలో ఉపాధి హామీ పథకం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి పురస్కారాలు అందుకున్నారు.
ఈ పథకం కింద జల సంరక్షణను సమర్థంగా నిర్వహించినందుకు గానూ తెలంగాణ.. దేశంలోనే ద్వితీయ స్థానంతో పురస్కారం దక్కించుకుంది. ఉపాధి హమీ పథకం అమలులో రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు అవార్డులు పొందాయి. గ్రామ పంచాయతీ, వ్యక్తిగత బ్లాక్ విభాగాల్లోనూ రాష్ట్రానికి పురస్కారం లభించింది.
ఇవీ చూడండి: మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం