ETV Bharat / state

ఈత కొలనులో చిన్నారుల చిందులు

అసలే ఎండకాలం... సూర్యుడి వేడికి చెమటలు కక్కిస్తున్నాడు. ఈ సమయంలో చల్లని నీళ్లలో ఈత కొడుతూ ఉంటే ఆ సరదానే వేరు కదా... అలా చిన్నారులంతా ఓ ఈత కొలనులో కేరింతలు కొడుతూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. అదేక్కడో మనమూ ఓసారి చూసొద్దామా?

author img

By

Published : Apr 18, 2019, 3:09 PM IST

ఈత కొలనులో చిన్నారుల చిందులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో చిన్నారులు చిందులేస్తున్నారు. చల్లని నీళ్లలో కేరింతలు కొడుతూ... సరదా తీర్చుకుంటున్నారు. అందులోనూ వేసవి సెలవులోచ్చేశాయ్. ఇక పిల్లల ఆటలకు హద్దులుండవు. ఈత నేర్చుకోవడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకుంటున్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈతకొలనులో చిన్న, పెద్ద తేడా లేకుండా నీటిలో సంతోషంగా గడుపుతున్నారు. నీళ్లపై కాళ్లను ఆడిస్తూ.. చేతులతో నీటిని కిందికి తోస్తూ ముందుకు సాగి పోవడం వల్ల చేప లాంటి అనుభూతిని కలుగుతుందని చిన్నారులు చెబుతున్నారు. భవిష్యత్తులో నీటిని చూసి భయ పడే పరిస్థితులు ఉండవని నిర్వహకులు చెబుతున్నారు. నీటిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఒడ్డుకు చేరే ఆత్మస్థైర్యంతో పాటు శరీరానికి మంచి వ్యాయామంగా ఈత ఉపయోగపడుతుందంటున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్విమ్మింగ్ పూల్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

Intro:TG_KRN_61_18_SRCL_SWIMING_FOOL_AVB_PKG_G1_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో చిన్నారులు కేరింతలు కొడుతూ ఈత సరదా తీర్చుకుంటున్నారు. వేసవి సెలవులు రావడంతో చిన్నారులు ఈత నేర్చుకోవడం తో పాటు , సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈతకొలనులో చిన్న, పెద్ద తేడా లేకుండా నీటిలో సంతోషంగా గడుపుతున్నారు. నీటిపై కాళ్లు కొడుతూ చేతులతో నీటిని కిందికి తోస్తూ ముందుకు సాగి పోవడం వల్ల చేప లాంటి అనుభూతిని కలిగిస్తుందని, భవిష్యత్తులో నీటిని చూసి భయ పడే పరిస్థితులు ఉండవని వారు చెబుతున్నారు. నీటిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఒడ్డుకు చేరే ఆత్మస్థైర్యం తో పాటు శరీరానికి మంచి వ్యాయామం గా ఈత ఉపయోగపడుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్విమ్మింగ్ పూల్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు.

బైట్: శ్రీనివాస్ , ఈత కొలను నిర్వాహకులు.
బైట్: వైష్ణవి, చిన్నారి సిరిసిల్ల.
బైట్: స్పందన, చిన్నారి తంగళ్ళపల్లి.
బైట్: సహస్ర, చిన్నారి హైదరాబాద్.

ఈటీవీ , ఈటీవీ భారత్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా ఈతకొలనులో లో సరదాగా గడుపుతున్న చిన్నారులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.