ETV Bharat / state

Sircilla District Hospital : కార్పొరేట్‌కు దీటుగా సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్య సేవలు

Sircilla District Hospital : సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తోంది. మారుమూల ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌, కరీంనగర్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అక్కున చేర్చుకుంటోంది. వీడియో కాన్ఫరెన్స్‌ సాయంతో నిమ్స్‌ సహా ఇతర ఆస్పత్రుల వైద్యుల నుంచి సలహాలు స్వీకరించి.. మెరుగైన చికిత్స చేస్తోంది.

Sircilla District Hospital
Sircilla District Hospital
author img

By

Published : Dec 30, 2021, 10:06 AM IST

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి వైద్య సేవలు

Sircilla District Hospital : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రి అత్యాధునిక పరికరాలు సమకూర్చుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌, బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేశారు. గుండెపోటుకు గురైనవారికి 90నిముషాల్లోపు అందించే సేవలు కల్పించడమే కాకుండా ఒకరి ప్రాణాన్ని సైతం కాపాడగలిగారు. రోగులకు మెరుగ్గా డయాలిసిస్ సేవలు అందిస్తున్నారు.

ఆధునిక హంగులతో సౌకర్యాలు..

Sircilla District Hospital Services : ఆస్పత్రిలో సీటీజీ, ఫిటల్‌డాప్లర్‌, అల్ట్రాసౌండ్‌ మిషన్‌, అధునాతన లేబొరేటరీ గది, హైడ్రాలిక్‌ ఆపరేషన్‌ టేబుళ్లు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలు కల్పించడం.. వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తుండటంతో ఆదరణ పెరిగింది. మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవ వల్లే సాధ్యమైందని వైద్యులు తెలిపారు.

700 ఓపీ..

Deliveries in Sircilla District Hospital : 'రోజుకు 700 ఓపీ కెపాసిటీ ఉంది. నిమ్స్​తో టై అప్ అయి సూపర్​ స్పెషల్ సేవలు అందిస్తున్నాం. 50-60 అడ్మిషన్లు అవుతున్నారు. కార్పొరేట్​ ఆస్పత్రులకు దీటుగా మా వద్ద సేవలందిస్తున్నాం. మంత్రి కేటీఆర్ చొరవతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు మా ఆస్పత్రిలో ఉన్నాయి.'

- డా. మురళీధర్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

60 శాతం డెలివరీలు మా ఆస్పత్రిలోనే..

Special Services in Sircilla Hospital : 'ప్రభుత్వాస్పత్రిలో డెలివరీల శాతం 30 ఉండేది. కేసీఆర్​ కిట్​లవల్ల 50-60 శాతానికి పెరిగింది. మా ఆస్పత్రిలో కూడా అంతకుముందు 100-120 డెలివరీ చేసేవాళ్లం. ఇప్పుడు 250-325 వరకు డెలివరీలు చేస్తున్నాం. మా జిల్లాలో అయ్యే డెలివరీల్లో 60 శాతం మా ఆస్పత్రిలోనే జరుగుతున్నాయి.'

- డా. తిరుపతి, మాతాశిశు కేంద్రం ఇన్‌ఛార్జి

ఇక్కడ నార్మల్ డెలివరీలు..

Sircilla District Hospital Super Services : 'ఫీల్డ్ లెవల్​లో అయితే మొదటి కాన్పు వాళ్లకి నార్మల్ డెలివరీ చేస్తారని ఇక్కడికి వస్తున్నారు. నార్మల్ డెలివరీకే మొగ్గు చూపుతున్నాం. అందుకే గర్భిణీలు ఎక్కువగా మా ఆస్పత్రికి రావడానికే ఆసక్తి చూపుతున్నారు. డెలివరీ కోసం వస్తోన్న వారి సంఖ్య పెరుగుతున్నందున ప్రసూతి పడకలు సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రసూతి పడకలు పెంచాలి.'

- డా.పల్లవి, గైనకాలజిస్టు

సేవలు భేష్..

'ఇక్కడ సౌకర్యాలు బాగా ఉన్నాయి. మొదటి కాన్పు నార్మల్​ అయింది. ఇప్పుడు రెండో కాన్పు కూడా నార్మలే అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడ రోగులకు వారితో పాటు ఆస్పత్రికి వచ్చిన వారికి అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి కూడా పరిశుభ్రంగా ఉంది.'

- రోగులు

2020 మేలో 315 ప్రసవాలు..

Corporate Services in Sircilla Hospital : వైద్యరంగంలో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రి తన రికార్డు తానే తిరగరాసుకుంటోంది. 2020 మేలో అత్యధికంగా 315 ప్రసవాలు కాగా.. గత నెలలో 324 నిర్వహించారు. వీటిలో 98 సాధారణ ప్రసవాలు ఉన్నాయి. ఫలితంగా ప్రసూతి సేవలపై మహిళల్లో నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్‌లు ఉండగా.. వారిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు రెగ్యులర్‌ గైనకాలజిస్ట్‌లు, కొంతమేర సిబ్బంది ఉన్నట్లయితే ప్రసవాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ప్రైవేటు ఆస్పత్రిలో సాధారణ ప్రసవానికి సైతం 40వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రసూతి పడకలు పెంచాలి..

ఇంతకు ముందు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నవారు సైతం.. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రి వైపు అడుగులేస్తున్నారు. ప్రసూతికి సంబంధించి మరిన్ని పడకలు పెంచాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.