రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్క్ర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చిపోయే వాహనాల పత్రాలను పరిశీలించారు.
అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంచామని ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ వెంకట నర్సయ్య, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఎస్బీఐలో చోరికి యత్నం... మోగిన అలారం